సద్దుల బతుకమ్మను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి... జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 17 (చక్రవాణి న్యూస్):తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకాంక్షించారు. సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగలను పురస్కరించుకొని జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ప్రకృతిని, పూలను ఆరాధించే బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషం, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు. బతుకమ్మ నిమజ్జన కార్యక్రమాలు సురక్షితంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
